టీజ‌ర్‌ : క‌త్తి దూసిన ఝాన్సీ రాణి

Tuesday, October 2nd, 2018, 12:10:32 PM IST

ఝాన్సీ రాణి క‌త్తి దూసింది. శ‌త్రువు త‌ల‌ల్ని తెగ న‌రికింది. తెల్లోడి శిర‌చ్ఛేద‌నంలో పోటీప‌డింది. రాణుల వీర‌త్వాన్ని ఎలివేట్ చేసింది మ‌ణికర్ణిక టీజ‌ర్‌. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఒక మ‌హారాణి పాత్ర‌ను ఇంత‌కంటే గొప్ప‌గా వేరొక‌రు ఆవిష్క‌రించ‌లేరు అన్న ప్రామిస్‌ని ఇచ్చింది ఈ టీజ‌ర్. 2019 మోస్ట్ అవైటెడ్ మూవీగా `మ‌ణిక‌ర్ణిక‌`ను ఈ టీజ‌ర్ నిల‌బెడుతోంది. గాంధీ జ‌యంతికి కంగ‌న ఇచ్చిన ట్రీట్ ఇది. బాహుబ‌లి, థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్ త‌ర‌హాలోనే బారీ విజువ‌ల్ ఎఫెక్ట్స్ నేప‌థ్యంలో ఝాన్సీరాణిపై సినిమా తెర‌కెక్కుతోందని తాజా టీజ‌ర్ ఎలివేట్ చేసింది.

మ‌ణిక‌ర్ణిక టీజ‌ర్ ఆద్యంతం కంగ‌న శ్ర‌మ క‌నిపించింది. గుర్ర‌పు స్వారీలో, క‌త్తి చేత‌ప‌ట్టి శ‌త్రువుపై లంఘించ‌డంలో సిస‌లైన క్వీన్‌ని త‌ల‌పించింది. ఎమోష‌న‌ల్ సీన్స్‌లో క్వీన్ హావ‌భావాలు ఫెంటాస్టిక్ గా క‌నిపించాయి. భారీ కోట‌ల‌-ఘ‌డీలు, సైన్యం, రాజులు, రాణులు మైండ్ బ్లోవింగ్. ఇక ఝాన్సీ రాణి అంటే త‌న‌తో పాటే ఒక బిడ్డ ఉంటాడు. సింహాస‌నంపై త‌న‌తో పాటే బిడ్డ కూచున్న దృశ్యాన్ని సింబాలిక్‌గా రివీల్ చేశారు. ఆజాద్ అంటూ ఈస్ట్ ఇండియా కంపెనీ జెండాని చీల్చుకుంటూ దూసుకొచ్చే ఝాన్సీ రాణి, హ‌ర హ‌ర మ‌హాదేవ్ .. ! అంటూ ర‌క్తంతో త‌డిసిముద్ద‌యి క‌నిపించిన తీరు ఎమోష‌న్‌ని రాజేస్తోంది. జ‌న‌వ‌రి 25న రిప‌బ్లిక్ డే కానుక‌గా.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని మెజారిటీ భాష‌ల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.