మణిరత్నం బాగానే ఉన్నాడు .. రూమర్స్ నమ్మకండి ?

Friday, July 27th, 2018, 11:36:06 AM IST

ప్రముఖ సినీ దర్శకుడు .. మణిరత్నం కు గుండెపోటు వచ్చిందంటూ, ఆయనను చెన్నై లోని అపోలో ఆసుపత్రికి తరలించారంటూ వస్తున్నా వార్తల్లో నిజం లేదని .. మణిరత్నం వర్గాలు తెలిపాయి. అయన బాగానే ఉన్నారని, కేవలం మెడికల్ పరీక్షల కోసమే అయన ఆసుపత్రికి వెళ్లారని తెలిపారు. మణిరత్నంకు గొండెపోటు అంటూ వార్తలు రావడంతో ఫిలిం వర్గాలతో పాటు అయన ఫాన్స్ టెన్షన్ పడ్డారు. దర్శకుడిగా ఇండియన్ సినిమా చరిత్రలో తనదైన ప్రేత్యేకతను అందుకున్న అయన సినిమాలంటే ఇష్టపడని ప్రేక్షకులు ఉండరు. ఈ మద్యే కాస్త వరుస పరాజయాలతో టెన్షన్ మీదున్న అయన తన తదుపరి సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు. అయన తాజాగా రూపొందిస్తున్న చక్క ఛీవంతం వానం అనే తమిళ చిత్రం తెరకెక్కిస్తున్నారు .. ఈ చిత్రాన్ని నవాబ్ పేరుతొ తెలుగులో విడుదల కానుంది.

  •  
  •  
  •  
  •  

Comments