ప్రియాంక చోప్రా .. ప్రేమాయణం సాగిస్తుందా ?

Saturday, February 11th, 2017, 12:16:53 PM IST


బాలీవుడ్ హాట్ భామ ప్రియాంక చోప్రా వ్యవహారం ఈ మధ్య మంచి జోరుమీదుంది. ఇప్పటికే బాలీవుడ్ లో దుమ్ము దులిపిన ఈ అమ్మడు అటు హాలీవుడ్ లోకూడా సత్తా చాటింది. హాట్ హాట్ అందాలతో హీటెక్కించే దీపికా ఆ మధ్య ప్రేమాయణం సాగిస్తున్నట్టు వార్తలు వచ్చాయి .. కానీ వాటికీ బలమైన రుజువులు దొరక్క పోవడంతో అదంతా ఉత్తిదే అని అనుకున్నారు .. వాటిని ప్రియాంక కూడా కొట్టి పారేసింది ? కానీ లేటెస్ట్ గా డిజైనర్ మనీష్ మల్హోత్రా ప్రియాంక ను అమెరికాలో కలుసుకున్నాడు. తనకోసం అమెరికా వచ్చిన మనీష్ మల్హోత్రా ని ప్రేమగా కలుసుకున్న ప్రియాంక కు ఈ సందర్బంగా మంచి పార్టీ ఇచ్చాడు. ఈ విందుకు బాలీవుడ్ తారలు సుశాంత్ సింగ్, దియా మీర్జా , తరుణ్ తదితరులు కూడా పాల్గొన్నారు. మనీష్ కోసం ప్రియాంక ప్రత్యేకంగా పార్టీ చేసుకోవడం అందరికి షాక్ ఇస్తుంది. మొత్తంగా ప్రియాంక వ్యవహారం తేడాగానే ఉంటుందని అంటున్నాయి బాలీవుడ్ జనాలు !!