మరో పెళ్ళికి సై అంటున్న మాజీ హీరోయిన్ ?

Thursday, September 22nd, 2016, 03:04:48 PM IST

manisha
మనిషా కొయిరాలా గుర్తుందిగా .. అప్పట్లో తనదైన గ్లామర్, అందంతో ఒక ఊపు ఊపిన ఈమే దాదాపు దశాబ్ద కాలం పాటు క్రేజీ హీరోయిన్ గా నిలబడింది. ముఖ్యంగా ”బొంబాయి” సినిమాతో ఈమెను ఎవరు మరిచిపోకుండా చేసింది. ఇక ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది. అయితే కొన్ని రోజులు కాపురం చేసాక ఇద్దరు విడిపోయారు, ఆ తరువాత భయంకరమైన కాన్సర్ భారిన పడి దానితో పోరాటం చేసి మళ్ళీ కోలుకుంది. ఇన్ని రోజులు ఏదోలా కాలక్షేపం చేసిన ఈమెకు ఇప్పుడు జీవితం బోర్ కొడుతుందట, అందుకనే మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఉందని చెబుతుంది? పెళ్ళికంటే ముందు ఓ ఆడపిల్లను దత్తత తీసుకోవాలని ఉందని చెబుతుంది. మళ్ళీ పెళ్ళికి రెడీ అయిన మనీషా అంటూ బాలీవుడ్ లో వార్తలు జోరుగా షికార్లు చేస్తున్నాయి. అన్ని అనుకున్నట్టుగా కుదిరితే ఆమె త్వరలోనే పెళ్లి చేసుకునే అవకాశం ఉంది మరి.