ప్రేమ, పెళ్లి.. అంతా సీక్రెట్ గా కానిచ్చేసిన హీరోయిన్..!!

Sunday, February 12th, 2017, 01:00:50 PM IST


హీరోయిన్లు ప్రేమలో పడడం, వారిని వివాహం చేసుకోవడం సాధారణంగా జరిగే వ్యవహారమే. వారి రహస్య వివాహాలు కూడా అరుదుగా జరుగుతుంటాయి. ప్రముఖ హీరోయిన్ మనిషా యాదవ్ రెండు రోజుల క్రితమే రహస్య వివాహం చేసుకుంది. చిత్రపరిశ్రమ లోని ఎవరికీ ఆమె ఆహ్వానం పంపకపోవడం విశేషం. వళుక్కు ఎన్ 18/9 తమిళ చిత్రం ద్వారా ఆమె హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ చిత్రం మంచి విజయం సాధించింది.

ఆ తరువాత వరుస అవకాశాలు ఆమె తలుపుతట్టాయి. అదలాల్ కాదల్ సెయ్ వీర్. జనాలు ఓరం, త్రిష ఇల్లన నయనతార వంటి చిత్రాల్లో ఆమె నటించింది. కాగా ఇటీవల ఆమెకు అవకాశాలు తగ్గడంతో ఐటెం సాంగ్ లకు సైతం ఓకె చెప్పింది. వెంకట్ ప్రభు దర్శకత్వం లో వచ్చిన చెన్నై 28 – 2 చిత్రం లో ఐటెం సాంగ్ లో మెరిసింది. ఇటీవల ఆమె ఘాడ ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. ఆమె రహస్య వివాహం చేసుకుందని తేలడంతో ఆ వార్తలు నిజమే అని తేలింది. బెంగుళూరుకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త వార్నిడ్ ని రెండు రోజులక్రితం రహస్య వివాహం చేసుకుంది. తనవివాహానికి ఆమె ఎవరిని ఆహ్వానించకపోవడం విశేషం. తనని హీరోయిన్ గా పరిచయం చేసిన దర్శకుడు బాలాజీ శక్తి వేల్ ని కూడా ఆహ్వానించలేదు.