బెల్లంకొండ సినిమాలో బాలీవుడ్ భామ?

Saturday, September 8th, 2018, 06:18:05 PM IST

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వరుస సినిమాలతో హీరోగా నిలబడేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. తాజాగా అయన నటించిన సాక్ష్యం సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించలేదు. దాంతో అయన తేజ దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తీ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది. ఈ సినిమాలో ఇప్పటికే ఓ హీరోయిన్ గా కాజల్ ని ఎంపిక చేసారు. మరో హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ గర్ల్ మన్నారా చోప్రా ను ఎంపిక చేశారట. ఆమె పాత్ర కథలో కీలకంగా ఉంటుందని టాక్. అల్లుడు శీను సినిమాతో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఆ తరువాత చేస్తున్న సినిమాలన్ని వరుసగా ప్లాప్స్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సరైన హిట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments