షాక్ .. సిక్స్ ప్యాక్ హీరోల గాలి తీసేసిన నటుడు ?

Sunday, October 15th, 2017, 01:44:41 PM IST

ఈ మధ్య అటు కొత్తగా వస్తున్నా హీరోలుగాని .. ఇప్పుడున్న హీరోలుగాని ఎక్కువగా సిక్స్ ప్యాక్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇక నటన గురించి పక్కన పెడితే.. హీరోయిన్ గ్లామర్ షొ చేసినట్టు హీరోలు సిక్స్ ప్యాక్ కోసం ప్రత్యేక సాంగ్స్ కూడా పెడుతున్నారు. తాజాగా ఏ హీరో వచ్చినా సిక్స్ ప్యాక్ కామన్ గా మారింది. అయితే ఇలా సిక్స్ ప్యాక్ హీరోల పై ఘాటు కామెంట్స్ వేసాడు బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్ ? మనోజ్ అంటే నటుడిగా ఏ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్నాడో అందరికి తెలుసు .. తాజాగా ఈయన సిక్స్ ప్యాక్ హీరోల పై ఫైర్ అందుకు అయ్యాడు అన్న విషయం పక్కన పెడితే .. సిక్స్ ప్యాక్ హీరోల గురించి అయన మాట్లాడుతూ .. ప్రస్తుతం కొత్తగా పరిచయం అవుతున్న హీరోల దృష్టాంతా సిక్స్ ప్యాక్ మీదే ఉందని, అసలు నటన గురించి ఎవరు ఆలోచించడం లేదని. కొందరికి అయితే యాక్టింగ్ గురించి అస్సలు తెలియదని అంటున్నాడు. కొందరైతే నటనపై దృష్టి పెట్టడం బాగానే ఉంది .. కానీ వారసులుగా పరిచయం అవుతున్న వారుకూడా సిక్స్ ప్యాక్ లపై ద్రుష్టి పెడుతున్నారని మండి పడుతున్నారు. సినిమాల్లో మంచి నటులుగా గుర్తింపు తెచ్చుకోవాలని అన్నారు.