అన్న ద‌ర్శ‌క‌త్వం.. త‌మ్ముడు హీరోయిజం!

Tuesday, June 5th, 2018, 03:10:50 PM IST

మంచు హీరోలు విష్ణు, మ‌నోజ్ కెరీర్ ప‌రంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. న‌టించిన సినిమాలేవీ హిట్టెక్క‌క‌పోవ‌డంతో గ‌త కొంత‌కాలంగా స్థ‌బ్ధుగా ఉంది మంచు కాంపౌండ్. అయితే ప్ర‌తిభ ఉన్నా కాలం క‌లిసిరాక‌పోవ‌డం ఈ అన్న‌ద‌మ్ముల్ని తీవ్రంగానే ఆలోచింప‌జేసింది. అప్ప‌ట్లో మంచు మ‌నోజ్ ఇక హీరోగా న‌టించ‌న‌ని అధికారికంగా సామాజిక మాధ్య‌మంలో ప్ర‌క‌టించ‌డం దుమారం రేపింది. అటుపై అన్న విష్ణు, డాడ్ మోహ‌న్‌బాబు అత‌డిని మంద‌లించి న‌టింప‌జేశారు.

అదంతా అటుంచితే, త‌మ్ముడి కెరీర్‌ని చ‌క్క‌దిద్దేందుకు ఒక అన్న‌గా విష్ణు బాధ్య‌త తీస‌కున్నార‌ని తెలుస్తోంది. ఆ క్ర‌మంలోనే తాను త‌మ్ముడిని స్వ‌యంగా డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాని మెజారిటీ పార్ట్ అమెరికాలో తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. ఈ సినిమాతో హీరోగా మ‌నోజ్‌, ద‌ర్శ‌కుడిగా విష్ణు నిరూపించుకోవాల‌ని త‌పిస్తున్నార‌ట‌. ఎలాంటి ఛాలెంజ్‌ని అయినా స‌మ‌ర్ధంగా టేక‌ప్ చేసేవాడే రియ‌ల్ హీరో. ప్ర‌స్తుతం ఈ అన్న‌ద‌మ్ముల స‌న్నివేశం అలానే ఉంది. ఒకే సినిమాతో ప్ర‌స్తుత పోటీ ప్ర‌పంచంలో ఈ ఇద్ద‌రూ స‌త్తా చాటాల్సి ఉంది.