పెద్ద నోట్ల మార్పు కోసం వెళ్లి దెబ్బకి పోలీసులకి దొరికారు

Saturday, November 19th, 2016, 01:00:43 PM IST

nakcusls
పెద్ద నోటు మార్పుదల విషయం లో మనలాంటి సామాన్యులు కూడా నానా తంటాలూ పడుతూ ఉంటే ఒక పక్క మావోయిస్ట్ లు తలలు పగల గోట్టుకుంటున్నారు . వారి దగ్గర ఉన్న పాత కరన్సీ మార్చుకోవాలి అంటే ఖచ్చితంగా జనాల్లోకి రావాలి, బ్యాంకుల ముందర నిలబడాలి. అన్నిటినీ మించి ఐడెంటిటీ కార్డు ఒకటి ఉండాలి మరి. మొన్ననే ఎం కౌంటర్ లో భారీ గా మవోలని కోల్పోయిన వారు చాలా షాక్ లో ఉన్నారు. వ్యాపారులు – పారిశ్రా మిక వేత్తల నుంచి విరాళాలు – బలవంతపు వసూళ్లతో మావోయిస్టులు నిధులు సమకూర్చుకోవడం అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సంచలన రీతిలో రూ.500 – రూ.1000 నోట్లను ఆకస్మికంగా రద్దుచేయడంతో మావోయిస్టులతోపాటు ఇతర నక్సలైట్ గ్రూపులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాయన్నది సమాచారం. రూ. 500 – 1000 పాత నోట్లను మార్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలో వారు వేసిన ఎత్తులకు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయని గిరిజనులు అంటున్నారు.ఝార్ఖండ్ లో ఇలాగే డబ్బులు మార్చుకోబోయి పోలీసులకి దొరికారు. ఆదివాసీ ల సహాయం తో నక్శలైట్ లు ఈ పని చేసారు.