ఎంపీ రఘురామ సభ్యత్వాన్ని రద్దు చేయండి… ఓం బిర్లా కు మార్గాని భరత్ ఫిర్యాదు!

Friday, June 11th, 2021, 05:58:53 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై, రాష్ట్ర ప్రభుత్వం పై వరుస విమర్శలు గుప్పిస్తున్న రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ పై నర్సాపురం నుండి ఎంపీ గా ఎన్నికై, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామ కృష్ణంరాజు పార్లమెంట్ సభ్యత్వం ను రద్దు చేయాలి అంటూ స్పీకర్ ఓం బిర్లా కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అని భరత్ వ్యాఖ్యానించారు.

అయితే రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల పై ఆధారాలను గతంలో స్పీకర్ ఓం బిర్లా కు సమర్పించామని వెల్లడించారు. అయితే ఇప్పటికే చాలా సార్లు రఘురామ కృష్ణంరాజు సభ్యత్వం రద్దు చేయాలని స్పీకర్ ను పలుమార్లు కోరిన విషయాన్ని వెల్లడించారు. అయితే రాజ్యాంగం లోని 10 వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ను రఘురామ కృష్ణంరాజు అతిక్రమించారు అంటూ చెప్పుకొచ్చారు.