ముఖ్యమంత్రి మాట్లాడే తీరు ఇది కాదు

Thursday, September 11th, 2014, 06:55:47 PM IST


తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ టీవీ9, ఏబీఎన్ చానెళ్ళ నిలిపివేత నేపధ్యంలో మీడియాపై చేసిన వ్యాఖ్యలను ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ తీవ్రంగా ఖండించారు. ఆయన మాట్లాడుతూ మీడియా మెడలు విరుస్తాం, పాతాళానికి తొక్కుతాం, పాతర వేస్తాం వంటి మాటలు మాట్లాడడం దారుణమని అభిప్రాయపడ్డారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ముందు తను మాట్లాడే తీరును సరి చేసుకోవాలని కట్జూ సూచించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ఇటువంటి వ్యాఖ్యలు అభ్యంతరకరమని, ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఇవి కావని తెలిపారు. అందరం ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయం గుర్తుంచుకోవాలని అన్న కట్జూ ఈ మేరకు చానళ్ళ నిలిపివేతను ఖండిస్తూ ప్రకటన చేసారు. అలాగే మీడియా స్వేచ్చను ఎవరూ అడ్డుకోలేరని, మీడియా స్వేచ్చ రాజ్యంగ బద్దమైనదని కట్జూ వివరించారు. ఇక బ్యాన్ చేసిన చానెళ్ళను తెలంగాణలో తిరిగి పునరుద్ధరించాలని లేకపోతే ఎంఎస్ఓలపై కఠిన చర్యలు తప్పవని మార్కండేయ కట్జూ హెచ్చరిక జారీ చేశారు.