పవన్ – త్రివిక్రమ్ మూవీలో ఆ ఫైట్ కేక పెట్టిస్తుందటగా !

Tuesday, October 31st, 2017, 08:05:33 PM IST

పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్ర ఫస్ట్ లుక్ ఇంకా విడుదల చేయలేదు కానీ అంచనాలు మాత్రం రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అంతగా అభిమానుల్లో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొని ఉంది. అటు త్రివిక్రమ్ సినిమాలని తీసుకున్నా, పవన్ మూవీ లని గమనించినా మూస పద్దతిలో ఉండే ఫైట్స్ వీరి సినిమాల్లో కనిపించవు. ఏదో ఒక వైవిధ్యంతో ఉంటాయి. కాగా ఈ సినిమాలో కూడా కళ్ళు చెదిరే ఫైట్ ని ఇటీవల షూట్ చేశారట. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఉండే ఆ ఫైట్ సినిమాకే హైలైట్ గా నిలవనునట్లు తెలుస్తోంది.

పవన్ కి మార్షల్ ఆర్ట్స్ లో పట్టున్న సంగతి తెలిసిందే. కాగా దానికి ఇంకాస్త పదునుపెట్టేలా నెల రోజుల పాటు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుని మరీ ఈ పోరాట సన్నివేశాన్ని పవన్ చేశారట. అభిమానుల అంచనాలని మరింత పెంచేలా ఈ ఫైట్ ఉంటుందని సమాచారం. కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణ కాస్తయినా తీర్చేలా నవంబర్ 7 త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ లోగోని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అజ్ఞాతవాసి అనే టైటిల్ దాదాపుగా ఖాయమైనట్లే.

  •  
  •  
  •  
  •  

Comments