చైతూపై మారుతి కోపానికి కార‌ణం?

Sunday, June 3rd, 2018, 12:06:20 PM IST

అక్కినేని నాగ‌చైత‌న్య‌పై ద‌ర్శ‌కుడు మారుతి కోపంగా ఉన్నారా? అంటే అవున‌నే స‌మాచారం. చైతూ ప్ర‌స్తుతం చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో `స‌వ్య‌సాచి` చిత్రీక‌ర‌ణ‌లో బిజీ బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా చిత్రీక‌ర‌ణ అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతోంది. ఈ ఆల‌స్యం మారుతి స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతోందిట‌. ఆ క్ర‌మంలోనే యంగ్ డైరెక్ట‌ర్ చైతూపై కాసింత కోపంగా ఉన్నాడ‌ని తెలుస్తోంది.

ఇక స‌వ్య‌సాచి చిత్రం ఈ జూన్‌లో రిలీజ్ కావాల్సి ఉన్నా, జూలైకి వాయిదా వేశారు. అప్ప‌టికీ ఈ సినిమా రిలీజ‌వుతుందా? అన్న‌ది సందేహ‌మేన‌ని తాజాగా రిపోర్ట్ అందింది. రీషూట్ల కోసం మ‌రికొంత స‌మ‌యం అవ‌స‌రం అవుతోందిట‌. ఆ క్ర‌మంలోనే ఆగ‌ష్టుకు వాయిదా ప‌డే ఛాన్సుంద‌ని చెబుతున్నారు. అంతకంత‌కు చైతూ వ‌ల్ల‌ ఆల‌స్యం మారుతి `శైల‌జారెడ్డి అల్లుడు` చిత్రానికి చిక్కులు తెస్తోంది. ఆ క్ర‌మంలోనే మారుతి గ‌రంగ‌రంగా ఉన్నార‌ని తెలుస్తోంది.