బాలీవుడ్ ఫార్ములాతో మారుతి

Thursday, September 22nd, 2016, 03:02:50 PM IST

maruthi
హీరో హీరోయిన్ల‌తో రెండు మూడు సినిమాల‌కి చొప్పున అగ్రిమెంటు కుదుర్చుకోవడం బాలీవుడ్ సంప్ర‌దాయం. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థ‌లు ఆ ప‌ని చేస్తుంటాయి. స‌ద‌రు హీరోహీరోయిన్ల‌కి బంప‌ర్ హిట్లొచ్చినా, అట్ట‌ర్ఫ్లా పులొచ్చినా… వ‌రుస‌గా ఆ సంస్థ‌లోనే సినిమాలు చేయాల్సి వుంటుంది. అందుకోసం ముందస్తుగానే మొత్తం అమౌంట్ ముట్ట‌జెబుతారు. ఇప్పుడు అదే ఫార్ములాని టాలీవుడ్ డైరెక్ట‌ర్ మారుతి ఫాలో అవుతున్నాడు. చిన్న చిన్న హీరోహీరోయిన్ల‌కి ఆయ‌న అడ్వాన్సులు ఇస్తూ ఆయ‌న ఒప్పందాలు కుదుర్చుకొంటున్నాడు. ఇటీవ‌ల పెళ్లిచూపులుతో హిట్టు కొట్టిన విజ‌య్దే వ‌ర‌కొండ‌తో వ‌రుస‌గా మూడు సినిమాలు చేసేలా మారుతి ఒప్పందం కుదుర్చు కున్న‌ట్టు తెలిసింది. అంటే మారుతి ఎప్పుడు ఏ సినిమా చేస్తాన‌న్నా విజ‌య్ దేవ‌ర‌కొండ కాల్షీట్లు కేటాయించాల్సిందే అన్న‌మాట‌. విజ‌య్‌కి త‌గ్గ క‌థ ఒక‌టి త‌న ద‌గ్గ‌ర ఉండ‌టంతోపాటు, మ‌రో రెండు క‌థ‌లు త‌న స్నేహితుల ద‌గ్గ‌ర ఉన్నాయ‌ట‌. అందుకే ఆయ‌న‌తో వ‌రుస‌గా మూడు సినిమాలు తీయ‌బోతున్నాడ‌ట మారుతి. మ‌రి ఆ చిత్రాల‌కి తానే ద‌ర్శ‌క‌త్వం చేస్తాడా లేదంటే త‌న స్కూల్‌కి చెందిన ఇత‌ర ద‌ర్శ‌కుల్ని రంగంలోకి దించుతాడా అన్న‌ది చూడాలి.