మళ్ళీ మెగా హీరోని పట్టేసిన మారుతి ?

Thursday, May 17th, 2018, 11:39:33 AM IST

దర్శకుడు మారుతి మళ్ళీ మెగా కాంపౌండ్ లో ఛాన్స్ పట్టేసాడు. ఇదివరకే అల్లు శిరీష్ తో కొత్త జంట, గీత ఆర్ట్స్ బ్యానర్ లో భలే భలే మగాడివోయ్ లాంటి హిట్ సినిమా చేసాడు. ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య తో శైలజా రెడ్డి అల్లుడు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత అయన మళ్ళీ మెగా హీరోతో ప్లాన్ చేస్తున్నాడట !! అయితే ఈ సారి అయన సినిమా చేసే మెగా హీరో ఎవరో తెలుసా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం కరుణాకరన్ తో తేజ్ ఐ లవ్ యూ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది .. దాని తరువాత నెక్స్ట్ మారుతి తో చేయాలనీ ఫిక్స్ అయ్యాడట. ఈ మధ్య వరుస పరాజయాలతో టెన్షన్ మీదున్న సాయి ధరమ్ కు కరుణాకరన్ సినిమా పై చాలా ఆశలే పెట్టుకున్నాడు.