ట్రైల‌ర్ చూడ‌గానే గాల్లోకి లేస్తారు జాగ్ర‌త్త‌!

Tuesday, September 18th, 2018, 03:50:59 PM IST

డిస్నీ సంస్థ నుంచి ఓ సినిమా వ‌స్తోంటే అది ఉత్కంఠ‌కు గురి చేస్తుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తారు. ఏదో ఒక కొత్త‌ అద్భుతం తెర‌పై ఆవిష్కృత‌మ‌వుతుంది. ఒక కొత్త ప్ర‌పంచాన్ని వీక్షించే మ‌హాద్భాగ్యం క‌లుగుతుంద‌ని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తారు. అలాంటి ఓ అద్భుతాన్ని మ‌రోసారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కాభిమానుల ముందుకు తెచ్చేందుకు రెడీ అవుతోంది డిస్నీ.

`మేరి పాపిన్స్ రిట‌ర్న్స్` అనేది టైటిల్‌. డిస్నీ సంస్థ నుంచి వ‌స్తున్న లేటెస్ట్ సినిమా ఇది. డిసెంబ‌ర్ 19న‌ క్రిస్మ‌స్ కానుక‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. ఇదివ‌ర‌కూ రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించిన `మేరి పాపిన్స్‌` కి సీక్వెల్ చిత్ర‌మిది. తాజాగా ట్రైల‌ర్ రిలీజై ఆక‌ట్టుకుంది. పార్ట్ 1కి కొన‌సాగింపుగా ఉన్న ఈ సీక్వెల్‌లో తిరిగి ఇహ‌లోకంలోని పిల్ల‌ల కోసం విచ్చేస్తుంది మేరి పాపిన్స్. భూమ్మీదికి వ‌చ్చిన పాప్కిన్స్ ఎలాంటి వింత‌లు, విశేషాల‌కు తెర తీసింది? ఆ అద్భుతాలు ఏంటి? అన్న‌దే సినిమా. ఎమిలీ బ్లంట్ మేరి పాప్కిన్స్ పాత్ర‌లో న‌టించారు. బెన్ విషా, మెరిల్ స్ట్రీప్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. 2డి, 3డి వెర్ష‌న్స్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది.