మాస్ కి విందుభోజనం పెట్టిన సూర్య

Friday, February 10th, 2017, 11:45:02 AM IST


రొటీన్ సినిమాల మధ్యన ఏదైనా వైవిధ్యమైన సినిమా వస్తే ప్రేక్షకులు దానికి బ్రహ్మరథం పట్టేస్తారు. రొటీన్ కమర్షియల్ సినిమాలు చూసి బోర్ కొట్టేసిన వాళ్లకి ఒక వింత సినిమా వస్తే నిజంగా వింతే. కానీ ఇప్పుడు సీన్ మారింది. స్టార్ హీరోలు అందోరో వైవిధ్యమైన సినిమాలు తీస్తూ ఉండడం తో మాస్ సినిమాలకీ మాస్ ప్రేక్షకులకీ సరియన చిత్రాలే రావడం లేదు. నాటు టేస్ట్ దొరక్క బీసీ సెంటర్ లలో ముద్ద దిగడం లేదు. ఇలాంటి వారి కోసం సింగం 3 వచ్చేసింది. సూర్య మామూలుగా ఎక్స్పెరిమెంటల్ సినిమాలే ఎక్కువగా చేస్తాడు కానీ ఇప్పుడు సింగం 3 తో మరొక్క సారి తన మాస్ పంజా విసిరాడు సూర్య. ఆ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్టయింది. ఈ సినిమా ఎప్పుడు టీవీలో వచ్చినా అతుక్కుపోతారు జనాలు. దీనికి కొనసాగింపుగా వచ్చిన సింగం-2 కూడా మాస్ ప్రేక్షకుల్ని మురిపించింది. ఇప్పుడు మాస్ సినిమాలు బాగా కరువైపోతున్న రోజుల్లో ఆ వర్గం ప్రేక్షకులకు విందు భోజనంలా దొరికింది ‘సింగం-3’.‘సింగం-3’ ఆడియన్స్. ఇందులో గూస్ బంప్స్ మూమెంట్లకు కొదవలేదు. హీరోయిజాన్ని ఓ రేంజిలో పండించేశారు హరి-సూర్య.