నన్ను సెహ్వాగ్ తో పోల్చకండి..పంజాబ్ కెప్టెన్!

Saturday, March 3rd, 2018, 07:42:12 PM IST
భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అప్పట్లో ఏ స్థాయిలో క్రికెట్ అడేవారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరు అడుగుపెడితే చాలు మొదటి బంతి బౌండరీ దాటాల్సిందే. ఏ మాత్రం వేగాన్నీ తగ్గించకుండా ఒత్తిడిని తట్టుకొని బంతులను కొట్టడం సెహ్వాగ్ కె చెల్లింది. అంతే కాకుండా భయంకర స్పీడ్ బౌలర్లను మాయాజాలం లాంటి స్పిన్ బౌలర్లకు సెహ్వాగ్ సమర్థవంతంగా తన బ్యాట్ తో సమాధానం చెప్పగలడు. సెహ్వాగ్ గ్రీజ్ లో ఉన్నంత వరకు క్రికెట్ అభిమానులకు మజా మిస్ అవ్వదని చెప్పవచ్చు.
అయితే రీసెంట్ గా అదే తరహాలో ఒక యువ కెరటం సెహ్వాగ్ ఆటను తలపిస్తోందని. అచ్చం సెహ్వాగ్ లనే ఆడుతున్నాడు అని మంచి ప్రశంసలను అందుకుంటున్నాడు. అతను ఎవరో కాదు. మయాంక్ అగర్వాల్. ఈ మధ్య  విజయ్‌ హజారే టోర్నీలో ఓపెనర్‌గా మంచి ప్రతిభను కనబరిచాడు. మయాంక్‌ టోర్నీలో మొత్తంగా 723 పరుగులు సాధించి ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ -11వ సీజన్ లో పంజాబ్ జట్టుకి కెప్టెన్ గా కూడా ఎంపికయ్యాడు. కానీ తాను మాత్రం ఇంకా ఆటలో చాలా రాణించాల్సి ఉందని మయాంక్ చెబుతున్నాడు. ముఖ్యంగా తనకు సెహ్వాగ్ తో పోల్చవద్దని ఆయన స్థాయికి నేను ఇంకా అందుకోలేదు అందుకోను కూడా. సెహ్వాగ్ లాంటి ఆడడం చాలా గొప్ప విషయం. ఆయన నాకు చాలా స్ఫూర్తి. పంజాబ్ మెంటర్ గా ఉన్న సెహ్వాగ్ ని కలిసి కొత్త మెళకువలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తాను అని మయాంక్ వివరించాడు.