చెల్లాచెదురైన మహాకూటమి !

Tuesday, June 4th, 2019, 02:27:34 PM IST

భాజపాను ఎదిరించడమే లక్ష్యంగా ఏర్పడిన ఎస్పీ, బీఎస్పీ, ఆర్.ఎల్.డీ మహాకూటమి లోక్ సభ ఫలితాలతో చెల్లాచెదురైంది. యూపీలో ఎస్పీకి బీఎస్పీ సహకరిస్తే కేంద్రంలో ప్రధాని కావడానికి మాయవతికి ఎస్పీ సపోర్ట్ ఇవ్వాలని ఈ కూటమి ఒప్పందం. ఒప్పందం మేరకు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేసి మెరుగైన ఫలితాల్ని రాబట్టిన కూటమి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం చతికిలపడింది.

ఎస్పీ 37, బీఎస్పీ 36 స్థానల్లో పోటీ చేయగా బిఎప్సీ 10 స్థానాలు, ఎస్పీ 5 స్థానాలు మాత్రమే గెలవగలిగాయి. భాజాపా ఏకంగా 62 సీట్లు గెలిచింది. తమ పార్టీకి ఎస్పీ యొక్క యాదవ ఓటు బ్యాంకు అనుకూలిస్తుందని, తద్వారా 35 స్థానాలు గెలవచ్చని మాయవతి అనుకున్నారు. కానీ యాడవులు ఎస్పీకే ఓటు వేయలేదు. ఫలితంగా అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్, తమ్ముళ్లు అక్షయ్, ధర్మెంద్రలు కూడా ఓడిపోయారు.

ఇలా సొంత వర్గం నుండి కూడా ఓట్లు రాబట్టుకోలేని పార్టీతో ఇకపై పొత్తు అనవసరం అనుకున్న మాయవతి రానున్న 11 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో మహాకూటమి కాస్త చెల్లాచెదురైంది.