మేడే స్పెష‌ల్‌.. మేలుకోరా కార్మికుడా!?

Tuesday, May 1st, 2018, 02:21:47 AM IST


ప్ర‌పంచం ఇంత ఎదిగింది.. గొప్ప సాంకేతిక‌త వ‌చ్చింది అని చంక‌లు గుద్దుకుంటున్నా.. ఇప్ప‌టికీ కార్మికుల‌కు స‌రైన జీత‌భ‌త్యాల గ్యారెంటీ అన్న‌దే లేదు. భార‌త‌దేశంలో ఈ అవ్య‌వ‌స్థ ఇప్ప‌టికీ అలానే ఉంది. ఉద్యోగ‌వ్య‌వ‌స్థ‌లో డొల్ల‌త‌నం, స‌ర్కారు వెన‌క‌బాటుత‌నం, అతి జ‌నాభా స‌మ‌స్య ఇవ‌న్నీ పెనుప‌రిణామాలుగా ఉన్నాయి. అయితే అస‌లు మే1 సంద‌ర్భంగా మేడే గురించి గుర్తు చేసుకోవాల్సి వ‌స్తే…

భారత దేశంలో మొదటి సారిగా 1923 న ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. దేశంలో డాంగే నాయకత్వంలో 1923 లో భారత కమ్యానిస్టు పార్టీ ఏర్పడింది. అయితే, చికాగో నగరంలో కంటే భారత దశంలోని కలకత్తాలో కార్మికులు నిర్ణిత పని గంటల కోసం హౌరా రైల్వే స్టేష న్‌లో 1862 లో సమ్మెచేశారు. కాగా, అది ప్రపంచ వ్యాప్తంగా అంతగా గుర్తింపు రాలేదు. పారిశ్రామిక రంగంలో ఎన్నోమార్పులు సంభవించాయి.కార్మికుల శ్రమ శక్తిని పెట్టుబడిదారులు కన్పించని రూపంలో దోపిడి చేస్తున్నారు. 1985 తర్వాత దేశంలో ప్రైవేటీకరణ,లిబరైజేషన్, గ్లోబలైజేషన్ పరిణామాల వలన అసంఘటిత కార్మిక వర్గాల చట్టాలు అమలుకు నోచుకోలేదు. నేటికి ఐటీ రంగంలో యువతి,యువకుల శ్రమ శక్తిని దోచుకుంటున్నారు. ప్రపంచీకరణ, సామ్రాజవాదం, పెట్టుబడిదారులు,బహుళజాతి కంపిణీలు కార్మిక వర్గాలను శ్రమ దోపిడి చేస్తున్నారు. అందు కోసం కార్మిక శ్రేణులు ఏకాం కావాల్సిన చారిత్రక సందర్భం వచ్చింది. అదే మేడే అని చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం కార్మికులు మేడే రోజు ఎర్రని దుస్తులు ధరించి కార్మిక ఐక్యతను,శ్రమ శక్తి విలువను చాటుతారు.