రేపే పోలింగ్

Friday, September 12th, 2014, 05:20:10 PM IST


నిన్నటితో మెదక్ ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడింది. మైకులు ముగబోయాయి.ఇక మిగిలించి ఓటరుల తీర్పు మాత్రమే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో రెండు చోట్ల ఉప ఎన్నికలు జరుగుతున్నా.. మెదక్ పార్లమెంట్ స్తానానికి జరిగే ఉప ఎన్నికే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అధికార తెరాస పార్టీ, గత ఎన్నికలలో ఘోరంగా పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ ఇక జత కట్టి డంకా మోగించిన బీజేపి-తెలుగుదేశం పార్టీ కూటమిలు ఈ ఉప ఎన్నికలలో పోటిపడుతున్నాయి. ప్రచారంలో ఆయా పార్టీలు తమ తమ శక్తికొలది అవతలి పార్టీలను విమర్శించాయి. పోటాపోటీగా సభలు ఏర్పాటు చేశాయి. ఎప్పటిలాగే.. అన్ని పార్టీల మీటింగులకు జనాలు భారీగానే వచ్చారు. అన్ని పార్టీలు తమదే విజయమని చెప్పుకుంటున్నాయి.
తెలంగాణ తెచ్చామని ఒకరు, తెలంగాణ ఇచ్చామని మరొకరు.. అభివృద్దే తమ నినాదమని ఇంకొకరు భారీగా బాగానే చెప్పుకున్నారు.. ఇంత చెప్పిన వారు.. చివరకు మరి ఎన్నికలముందు మందు.. డబ్బులు పంచడం ఏమిటో మరీ.. ఓటర్లపై అంత నమ్మకం ఉన్న పార్టీలు.. ఓటర్లను ప్రలోభపెట్టడం ఎందుకు.. నోటికి వచ్చిన హామీలను గుప్పించడం ఎందుకు.. వీటికి మాత్రం సమాధానం ఉండదు.. రేపు జరిగే పోలింగ్ లో ఓటర్లు ఏపార్టీకి పట్టం కట్టబోతున్నారో.. తెలియాలంటే.. సెప్టెంబర్ 16 వరకు ఆగాల్సిందే..