మీడియాకు సంకెళ్లా?

Monday, October 20th, 2014, 12:42:23 PM IST

tv9-and-abn
తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జర్నలిస్ట్ లు మరోసారి ఆందోళనకు దిగారు. నాలుగు నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి , టీవీ9 చానెళ్ళ ప్రసారాలను నిలిపివెయ్యడాన్ని నిరసిస్తూ తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద విలేకరులు ఆందోళనకు దిగారు. జర్నలిస్ట్ ల దీక్షకు రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. ఇక మీడియాకు సంకెళ్లా? మీడియాకు గొంతునివ్వండి..ప్రజాస్వామ్యంలో స్వేచ్చకు అర్ధమిదా? అంటూ నినాదాలు చేస్తూ విలేకరులు ఆందోళనకు దిగారు. అలాగే తెలంగాణలో ఏబీఎన్, టీవీ9 మీడియా ప్రసారాలను పునరుద్ధరించాలని వీరు డిమండ్ చేస్తున్నారు.