సిగ్గుచేటు : ఆర్టీసీ ఉద్యమాన్ని నీరుగారుస్తున్న మీడియా

Wednesday, October 9th, 2019, 01:34:58 PM IST

మీడియా అనేది ఎప్పుడు కూడా సామాన్యల పక్షము ఉండాలి, సమాజంలో జరుగుతున్నా వాటిని బయట ప్రపంచానికి తెలిసేలా చేయాలి. ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా మీడియా అనేది పనిచేయాలి, కానీ నేడు మీడియా అనేది సొంత బ్యాండ్ బాజా మాదిరి మారిపోయింది. అవసరాలకి తగ్గట్లు మీడియా తన రంగు,రూపం మార్చుకుంటుంది. ముఖ్యంగా తెలంగాణలో అయితే మీడియా అనేది ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ మాదిరి మారిపోయింది.

తాజాగా తెలంగాణలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్నా ఆర్టీసీ సమ్మె విషయానికి వస్తే రాష్ట్రంలోని ప్రధాన మీడియా సంస్థలు సరిపడిన కవరేజ్ ఇవ్వటం లేదు. ఇస్తున్న కవరేజ్ లో కూడా ఆర్టీసీ ఉద్యోగులదే తప్పు అన్నట్లు చూపిస్తుంది. కేసీఆర్ చేస్తున్న పనులు, తీసుకుంటున్న నిర్ణయాలు మంచివి అన్నట్లు,. ఆర్టీసీ వాళ్ళు మాత్రం మంకుపట్టు పట్టినట్లు చూపిస్తున్నాయి. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె వలన ఎలాంటి సమస్య లేదని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, ఉద్యమ వలన ఆర్టీసీ వాళ్ళకే నష్టమన్నట్లు చూపిస్తున్నాయి.

కనీసం అసలు ఆర్టీసీ వాళ్ళు ఎందుకు ఉద్యమ చేస్తున్నారనే విషయాన్నీ ప్రధాన మీడియా సంస్థలు అసలు చూపించటం లేదు. ఆర్టీసీ గొంతు ఎక్కడ కూడా సరిగ్గా వినిపించకుండా చేయటానికే మీడియా సంస్థలు పనిచేస్తున్నాయి. మీడియా సంస్థలో యాజమాన్యం మారిపోయింది, దీనితో వాళ్ళ ప్రాధాన్యతలు కూడా మారిపోయాయి. అధికారంలో వున్నా వాళ్ళకి అనుకూలంగా తమ స్వరం వినిపిస్తున్నాయి మీడియా సంస్థలు. మీడియా అనేది ఎప్పుడు ప్రతిపక్షము పాత్ర వహించాలి, కానీ ప్రస్తుతం అలాంటి మీడియా ఎక్కడ కూడా కనిపించటం లేదు.