మీడియా నుంచి ట్రంప్ కి వార్నింగ్

Thursday, January 19th, 2017, 01:55:19 PM IST

trump1
అమెరికా లో వ్యవహారాలు చాలా భిన్నంగా ఉంటాయి. స్వేచ్చ గా ఉండడం తో పాటు మాట్లాడ్డం కూడా ఎక్కువే. మీడియా కి కూడా ఎక్కువ స్వేచ్చ ఉంటూ ఉంటుంది. మీడియా దూకుడు కూడా ఎక్కువే. పవర్ లోకి వచ్చిన వారు.. మీడియా విషయంలో అనుసరించే విధానాలు మారిస్తే.. గట్టిగా నిలదీసే పరిస్థితి ఉండదు. గతానికి భిన్నంగా కొత్త తరహా నిర్ణయాలు తీసుకుంటే నిలువరించటం.. ప్రశ్నించటం లాంటివి చేయటం పెద్దగా ఉండవు. ముఖ్యమంత్రులు మారినప్పుడు.. సెక్రటేరియట్ కు మీడియా రాకపై ఆంక్షలు విధిస్తే.. దమ్ముగా నిలదీసే మీడియా సంస్థలు దేశంలో ఎన్ని అంటే సమాధానం వెనువెంటనే చెప్పలేం.అమెరికన్ పాత్రికేయులు ఇప్పుడు ట్రంప్ కి బహిరంగ లేఖ రాసారు. ఈ లేఖ లో తమ స్వేచ్చ గురించి గట్టిగానే చెప్పారు వారు. పాఠకులకు ఏం ఇవ్వాలో మేం నిర్ణయిస్తాం తప్ప మీరు కాదు’’ అని అమెరికన్ వార్తా సంస్థలు తేల్చి చెప్పాయి.