నేటితో మెడికల్ కౌన్సిలింగ్ పూర్తీ

Wednesday, September 24th, 2014, 11:30:24 AM IST


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటితో మెడికల్ కౌన్సిలింగ్ పూర్తీ అయింది. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో మెడికల్ కౌన్సిలింగ్ నివహిస్తున్న విషయం తెలిసిందే. కాగ, నేటితో రెండోవిడత కౌన్సిలింగ్ పూర్తీ అయింది. మొదటి మరియు రెండో విడత కౌన్సిలింగ్ లలో కలిపి ఇప్పటివరకు 4706 ఎంబీబీఎస్, 1380బీడీఎస్ సీట్లు భర్తీ చేశామని ఎన్టీఆర్ ఆరోగ్యవిశ్వవిద్యాలయం ఓ ప్రకటనలో తెలియజేసింది. కాగ, ఈ రోజుతో కౌన్సిలింగ్ ముగియనున్నదని కౌన్సిలింగ్ అధికారులు పేర్కొన్నారు.