పిక్ టాక్ : తలక్రిందులుగా కూడా ఫోటోలు తీస్తారా..? ఫోటోలు వైరల్

Wednesday, April 25th, 2018, 04:01:42 PM IST

ఫోటోలు, వీడియోల పిచ్చి ఉండనిది ఎవరికి? ఇక.. పెళ్లిళ్లలో అయితే.. పెళ్లి కంటే ఫోటోలు దిగడానికి, వీడియోలు తీసుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు కొంతమంది. ఇక.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కూడా అంతే.. తమ వివాహాన్ని జీవితాంతం గుర్తుండి పోయేలా కెమెరాల్లో బంధించాలనుకుంటారు. దాని కోసం మంచి ఫోటోగ్రాఫర్లను పెట్టుకొని రకరకాల పోజులతో ఫోటోలు దిగుతుంటారు. అయితే.. మీరు ఎంతోమంది ఫోటోగ్రాఫర్లను చూసి ఉంటారు కాని.. ఈ ఫోటో గ్రాఫర్‌ను అయితే.. ఎక్కడా చూసి ఉండరు.

ఎందుకంటే.. ఈ ఫోటో గ్రాఫర్ సమ్‌థింగ్ స్పెషల్. పేరు విష్ణు. ఊరు కేరళలోని త్రిస్సూర్. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇతడి గురించే చర్చ. ఎందుకంటే.. రీసెంట్‌గా జరిగిన ఓ పెండ్లిలో ఫోటోలు తీశాడట విష్ణు. ఎలా తీశాడో తెలుసా? చెట్టు ఎక్కి మరీ.. తలకిందులుగా వేలాడి మరీ.. ఆ జంటను ఫోటో తీశాడు. ఇక.. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుండటంతో మనోడు లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. అయితే.. మనోడు ఇలా స్టంట్లు చేస్తూ ఫోటోలు తీయడం కొత్తేం కాదట. ఇదివరకు కూడా ఇలా చెట్లు ఎక్కి ఫోటోలు తీసేవాడట. ఇక.. మనోడు తీసిన ఫోటోలు, వీడియోలు వైరలవుతుంటంతో ఎంతో ఖుషీగా ఉన్నాడట.

  •  
  •  
  •  
  •  

Comments