ఘనంగా నాట్స్ విజయోత్సవ సంబరాల వేడుక ..

Sunday, September 22nd, 2019, 12:22:48 PM IST

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ సంబరాల విజయోత్సవ వేడుకని డల్లాస్ నాట్స్ విభాగం చాల ఘనం గా నిర్వహించింది. ఈ కార్యక్రమ విజయానికి ముఖ్య భూమిక పోషించిన పలు కార్య కర్తలను, సభ్యులను ఘనం గా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో స్వచ్చంద కార్య కర్తలను, దాతలను, సభ్యులను జ్ఞాపికలతో గౌరవ ప్రదంగా సత్కరించారు. ఈ వేడుక లో నాట్స్ BoD చైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్ మరియు అద్యక్షుకుడు మంచికలపూడి శ్రీనివాస్ లు 6 వ అమెరికా తెలుగు సభలో డల్లాస్ నాట్స్ విభాగం యొక్క పాత్ర అభినందనీయం అని కొనియాడారు. డల్లాస్ నాట్స్ విభాగ అభ్యున్నతి కి పలు కార్యక్రమాల్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు.

కంచర్ల కిషోర్ ని అభినందిస్తూ సమన్వయ కర్తగా తన సేవలని అందించినందుకు ప్రత్యేకం గా కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిది గా విచ్చేసిన బోడె ప్రసాద్ ని ఘనం గా సన్మానించి జ్ఞాపికని అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్నే విజయ్ శేఖర్, మాదాల రాజేంద్ర, అది గెల్లి , నూతి బాపు, కంచర్ల బిందు, ఫణి యలమంచిలి, గోవాడ అజయ్ తదితరులు పాల్గొన్నారు.

ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి