మీ..టూ ఎఫెక్ట్.. కేంద్ర‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన ఎంజే అక్బ‌ర్..!

Thursday, October 18th, 2018, 03:48:01 AM IST

దేశ‌వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న మీ..టూ దెబ్బ‌కి రాజ‌కీయ వ‌ర్గాల్లో తొలి వికెట్ ప‌డింది. ప‌లువురు మ‌హిళ‌ల నుండి లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ వ్య‌వ‌హారాల శాఖ స‌హాయ‌ మంత్రి ఎంజే అక్బ‌ర్ రాజీనామా చేయ‌డంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి ఎంజే అక్బ‌ర్ త‌న‌ని లైంగికంగా వేధించారంటూ జ‌ర్న‌లిస్టు ర‌మ‌ణి ఆరోప‌ణ‌లు చేసింది. ఇదే క్ర‌మంలో ఎంజే అక్బ‌ర్ ఓ పత్రిక‌కు ఎడిట‌ర్‌గా ఉన్న‌ప్పుడు త‌మ‌ని లైంగికంగా వేధించాడ‌ని.. ప‌లువురు మ‌హిళా జ‌ర్న‌లిస్టులు కూడా ఆరోప‌ణ‌లు చేశారు.

దీంతో వెంట‌నే స్పందించిన ఈ మంత్రి త‌న పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని.. త‌న ప్ర‌తిష్ట‌ను మ‌స‌కబార్చ‌డానికే ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆయ‌న న్యాయ‌స్థానాన్ని కూడా ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. బీజేపీ అధిష్టానానికి ఆయ‌న వివ‌ర‌ణ కూడా ఇచ్చార‌ని సమాచారం. అయితే తాజాగా మీ..టూ ఉధ్య‌మం ఉదృతం అవ‌డం.. మ‌రోవైపు కాంగ్రెస్ నుండి తీవ్ర‌మైన ఒత్తిళ్ళు రావ‌డంతో.. అక్బ‌ర్‌ను రాజీనామా చేయాల‌ని బీజేపీ పెద్ద‌లు సూచించార‌ట‌. దీంతో ఈరోజు ఆయ‌న రాజీనామా చేశారు. దీంతో ఈ కేంద్ర‌ మంత్రి రాజీనామ దేశ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఏది ఏమైనా మ‌హిళ‌ల పై లైంగిక వేధింపుల నేప‌ధ్యంలో ఏర్పడిన మీ..టూ ఉధ్య‌మం దేశంలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది.