సూపర్ స్టార్ సినిమాలో నితిన్ హీరోయిన్ ?

Tuesday, June 5th, 2018, 11:01:10 AM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించే సినిమాలో అవకాశం పట్టేసి లక్కీ గర్ల్ గా మారింది నితిన్ హీరోయిన్ మేఘ ఆకాష్. లై సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ రెండో సినిమాకూడా చల్ మోహన్ రంగ అంటూ నితిన్ తోనే చేసింది. అయితే బాడ్ లక్ ఏమిటంటే ఆ రెండు సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఈ అమ్మడికి కాస్త నిరాశ మిగిలింది . అయితేనేమి .. మేఘ ఆకాష్ క్రేజ్ పెంచేసుకుంది .. దాంతో ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. అందానికి అందం.. గ్లామర్ .. చలాకి తనం అన్ని ఉన్న మేఘ ఆకాష్ తాజాగా రజని కాంత్ సినిమాలో నటించనుంది. ప్రస్తుతం రజని నటించిన కాలా సినిమా విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమా తరువాత అయన కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పాడు. ఇందులో సిమ్రాన్, బాబీ సింహ, విజయ్ సేతుపతి నటిస్తున్నారు .. మరో కీ రోల్ కోసం మేఘ ఆకాష్ ని సంప్రదించారు. కథ విని ఓకే చెప్పింది మెగా .. అలా సూపర్ స్టార్ ఛాన్స్ కొట్టేసింది. మొత్తానికి బాడ్ లక్ అనుకున్న పిల్లకి ఇలా లక్కీ ఛాన్స్ తగిలింది.

  •  
  •  
  •  
  •  

Comments