శ్రీరెడ్డికి మెగా బ్రదర్ సీరియస్ వార్నింగ్?

Wednesday, April 18th, 2018, 04:47:52 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ విషయమై పెద్ద దుమారమే రేగుతోంది. వర్ధమాన నటీమణులు గాయత్రి గుప్తా, మాధవి లత, శ్రీరెడ్డి వంటి పలువురు హీరోయిన్ లు టాలీవుడ్ లో సినిమాల్లోకి తెలుగు అమ్మాయిలు రావాలంటే ఖచ్చితంగా లైంగిక కోరిక తీర్చాలని కొందరు నిర్మాతలు ఇబ్బందులకు గురిచేస్తున్నారు అనేది వారి ప్రధాన వాదన. ఇప్పటికే శ్రీరెడ్డి వాదనను కొందరు తప్పుపడుతుంటే మరి కొందరు మద్దతిస్తున్నారు. అయితే నేడు శ్రీరెడ్డి వ్యవహారంపై నటుడు నాగబాబు స్పందించారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొద్ది రోజులుగా శ్రీరెడ్డి వ్యవహారాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.

అయితే శ్రీరెడ్డి పోరాటం పక్కదారి పట్టిందని ఆయన అన్నారు. పేమెంట్స్‌, ఇతర విషయాల్లో సమస్యలు వస్తే పరిష్కరిస్తుందే తప్ప సినిమాల్లో అందరికీ ‘మా’ అవకాశాలు ఇప్పించలేదని వివరించారు. ‘మా’ సభ్యత్వం కావాలంటే రూ. లక్ష చెల్లించాల్సిందే అని స్పష్టం చేశారు. సీనియర్‌ నటులకు మాత్రమే గౌరవ సభ్యత్వం ఇస్తామని చెప్పుకొచ్చారు. అవగాహన లేకుండా ‘మా’పై విమర్శలు చేయొద్దని నాగబాబు కోరారు. అసలు కాస్టింగ్ కౌచ్ అనేది ఉందన్న విషయం ఇప్పుడే తెలిసిందా అని ఆయన ప్రశ్నించారు. ఇది గొప్ప విషయమని ఎవరూ అనుకోరని, దరిద్రమైనదని అందరికీ తెలుసునని ఆయన అన్నారు. సినిమా ఇండస్ట్రీ అనేది ఓ మినీ ప్రపంచమని, ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో, సినిమా ఇండస్ట్రీలో కూడా అదే జరుగుతుందన్నారు. ఇక్కడ కూడా మనుషులే ఉంటారని, దేవుళ్లుకాదని నాగబాబు అన్నారు.

మహిళలకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అద్భుతమైన హక్కులు ఇచ్చిందని అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తే వాళ్లను అరెస్టు చేయించే హక్కుందని, ఇండస్ట్రీలో ఎవరైనా ఒక అమ్మాయికి ఇన్‌డీసెంట్‌గా ప్రపోజ్ చేస్తే పీఎస్‌లో ఫిర్యాదు చేయండి, అప్పుడు విచారణ జరిపి పోలీసులు చర్యలు తీసుకుంటారని, అలాగే న్యాయవ్యవస్థ కూడా ఉందన్నారు. పోలీస్ స్టేషన్లకు, కోర్టులకు వెళ్లకుండా మరెక్కడికి వెళతారని నాగబాబు ప్రశ్నించారు. చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేమన్నారు. కాస్టింగ్ కౌచ్‌పై కమిటీ ఉండాలని అడిగారని, దీన్ని మనస్పూర్తిగా ఒప్పుకుంటున్నామని, అయితే కొంత సమయం పడుతుందన్నారు. మహిళలపై లైంగిక దాడులకు తాను వ్యతిరేకమని, అయితే తనేమి చేయలేనని నాగబాబు అన్నారు. అలాగని ఇండస్ట్రీ మొత్తాన్ని బ్లేమ్ చేయడం సరికాదని, ఇక్కడ10 శాతం వెధవలు ఉంటే, 90 శాతం మంచివాళ్లే ఉన్నారని, ఆ విషయం మర్చిపోకూడదని ఆయన అన్నారు. ఒక మహిళ అయివుండి తన తల్లి గురించి ఈ విధంగా మాట్లాడడం సరికాదని, అదే ఇంకెవరైనా అయివుంటే పరిస్థితి వేరేలా ఉండేదని ఆయన అన్నారు……

  •  
  •  
  •  
  •  

Comments