మెగాడాట‌ర్ మ‌రో శ్రుతిహాస‌న్ అవుతోందా?

Sunday, July 22nd, 2018, 02:00:06 PM IST

ఔను.. ఆడాళ్లు ఓడ్కా తాగుతారా? లేదూ.. వైన్ తాగాల‌నుకుని పొర‌పాటున‌ ఓడ్కా తాగేస్తారా? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం తెలియాలంటే మెగా డాట‌ర్ నీహారిక‌ను అడ‌గాల్సిందే!!

నాగ‌బాబు త‌న‌య‌, మెగా ప్రిన్సెస్ నీహారిక న‌టించిన హ్యాపీ వెడ్డింగ్ రిలీజ్‌కి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ ప‌రంగా హీట్ పెంచారు. నీహారిక‌, క‌థానాయ‌కుడు సుమంత్ అశ్విన్ ఇద్ద‌రూ ప‌లు టీవీ చానెళ్ల‌లో హోరెత్తిపోయే ప్ర‌చారం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆనంద్ (అశ్విన్)- అక్ష‌ర (నీహారిక‌) మ‌ధ్య ప్రేమ‌క‌థ‌ను అందంగా మ‌లిచార‌ని నీహారిక తెలిపారు. అంతేకాదు.. ప్ర‌తి ప్రేమికుడిలానే ఆనంద్ తొలుత త‌న‌ను గాజుబొమ్మ‌లా చూసుకుని చివ‌రికి మ‌ట్టిబొమ్మ‌లా చూసుకోవ‌డ‌మేంటో అర్థం కాలేద‌ని చిట్‌చాట్‌లో స‌ర‌దా స‌ర‌దా విష‌యాలు చెప్పింది. అన్న‌ట్టు హ్యాపీ వెడ్డింగ్ ట్రైల‌ర్‌లో ఓ డైలాగ్ ఉంటుంది. వైన్ తాగాల‌నుకుని ఓడ్కా తాగేశాను.. అంటూ క‌థానాయ‌కుడి భుజాల‌పై నీహారిక వాలిపోయే స‌న్నివేశం ఉంది. మొత్తానికి సినిమా సినిమాకి నీహారిక‌లో ప‌రిణ‌తి ఆక‌ట్టుకుంటోంది. ఎంచుకుంటున్న ప్రేమ‌క‌థ‌లు త‌న‌కు ఫాలోయింగ్ అంత‌కంత‌కు పెంచుతున్నాయ‌న‌డంలో సందేహం లేదు. ఇక మెగాభిమానులైతే త‌మ ఫేవ‌రెట్‌ నీహారిక మ‌రో శ్రుతి హాసన్ అంత క్రేజీ స్టార్‌గా ఎద‌గాల‌ని ఆశిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments