మెగా డాటర్ .. ఆడియో విదేశాల్లో ?

Sunday, January 7th, 2018, 01:43:51 PM IST

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక కు మొదటి సినిమా తీవ్ర నిరాశ మిగిల్చడంతో కాస్త గ్యాప్ తీసుకుని మరో సినిమా చేస్తుంది. దాంతో పాటు అటు వెబ్ సిరీస్ లను చేస్తున్న నిహారిక తమిళంలో చేస్తున్న ఓరు నల్ల నాల్ పాటు సోల్రేం అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ప్రస్తుతం వైశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మలేషియాలో చిత్రీకరణ జరుపుతున్నారు. షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో అప్పుడే ప్రమోషన్ కూడా మొదలు పెట్టారు. ఈ సినిమా పాటల వేడుక కూడా మలేషియాలో జరపనున్నారట. ప్రస్తుతం మలేషియాలో తమిళ సినిమాకు సంబందించిన పలు కార్యక్రమాలు నిర్వాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడే ఈ ఆడియో జరిపితే బాగుంటుందని భావించింది యూనిట్. విజయ్ సేతుపతి, గౌతమ్ కార్తీక్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా పై మెగా డాటర్ చాలా ఆశలే పెట్టుకుంది. ఈ నెల చివరి వారంలో సినిమాను విడుదల చేస్తారట.