షాక్…మెగా ఫ్యామిలీ మనం వచ్చేస్తుందట !!

Monday, January 23rd, 2017, 11:30:24 AM IST

chiru
మొత్తానికి మెగాస్టార్ తన స్టామినాను ”ఖైదీ నంబర్ 150” వ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పటికే భారీ వసూళ్ల దిశగా దూసుకెళుతున్న ఈ సినిమా తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 151వ సినిమాకు అప్పుడే సన్నాహాలు మొదలు పెట్టారు. ఇక లెటస్ట్ గా ఖైదీ నంబర్ 150 వ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఫంక్షన్ లో టి సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ మెగాస్టార్, పవర్ స్టార్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో కలిపి ఓ సినిమా తీస్తానని అన్నాడు. అయితే ఇదంతా ఫాన్స్ లో ఉత్సాహం నింపేందుకే అన్నాడని అనుకున్నారు .. కానీ ఈ సినిమాకు అయన ప్రయత్నాలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఎలాగంటే .. ఖైదీ నంబర్ 150 వ సినిమా మంచి హిట్ అయినా నేపథ్యంలో సుబ్బిరామిరెడ్డి హైద్రాబాద్ లో ఆత్మీయ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ మెగా మల్టి స్టారర్ సినిమా చేస్తానని, తాను అశ్వినీదత్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు చెప్పారు. నిజంగా మెగా హీరోలంతా ఇలా ఒక సినిమాలో కలిసి నటించడం అంటే మెగా ఫాన్స్ కు పండగ అని చెప్పాలి?