మెగా సెల్ఫీ అదిరింది!

Tuesday, March 13th, 2018, 09:20:59 AM IST

టాలీవుడ్ లో బిగ్గెస్ట్ సెలబ్రెటీ ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్ హౌస్ లో ఏవైనా వేడుకలు జరిగితే ఆ సందడే వేరు. షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఏదైనా ఫంక్షన్స్ జరిగితే మెగా యువత మొత్తం ఒక చోట చేరుతుంది. ఇకపోతే రీసెంట్ గా మెగా స్టార్ చీరంజీవి పెద్ద కూతురు సుస్మిత పుట్టిన రోజు సందర్భంగా అందరు ఒక చోట చేరారు. వరుణ్ తేజ్ నిహారిక – అల్లు అర్జున్ ఆయన సతీమణి అల్లు స్నేహ మెగా స్టార్ చిన్న కూతురు శ్రీజ ఆమె భర్త కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా పార్టీలో పాల్గొన్నారు. అందరు సుస్మిత కి బర్త్ డే విషెస్ చెప్పిన అనంతరం ఒక సెల్ఫీకి స్టిల్ ఇచ్చారు. అందుకు సంబందించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.