వర్మ నీ సంగతి చూస్తామంటూ .. మెగా ఫాన్స్ ఫైర్ ?

Thursday, April 19th, 2018, 01:26:35 PM IST

తాజగా కాస్టింగ్ కౌచ్ నేపథ్యంలో నటి శ్రీ రెడ్డి చేస్తున్న రచ్చ గురించి తెలిసిందే. తాజాగా శ్రీ రెడ్డి నిన్న పవన్ కళ్యాణ్ ని తిట్టడంతో మెగా ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. శ్రీ రెడ్డి వ్యవహారంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఉన్నాడన్న విషయాన్నీ శ్రీ రెడ్డి బయట పెట్టడంతో మెగా అభిమానుల ఆగ్రహం ఇంకా పెరిగింది. పవన్ కళ్యాణ్ పై ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నారు. అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తాజగా మెగా అభిమానులంతా ఈ రోజు మీట్ అయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

నిర్మాత బన్నీ వాసు కూడా వర్మ పై ఫైర్ అవుతూ .. వర్మ నీ సంగతి చూస్తామంటూ వార్ణింగ్ ఇచ్చాడు. నీవు ఆడుతున్న డ్రామాలు మాకు తెలుసు. అనవసరంగా మెగా ఫ్యామిలీ ని గెలికేసవు .. ఇక మెగా అభిమానులను ఏప్ ప్రయత్నం చేయబోమని ఆయన చెపాప్డు. తామంతా బయటికి వస్తున్నామని .. యుద్దానికి సిద్ధంగా ఉండమని హెచ్చరించాడు. ఈ రోజు సాయంత్రం మెగా ఫాన్స్ నిర్ణయం ఏమిటన్న విషయాన్ని ప్రకటిస్తానని చెప్పేసాడు. మొత్తానికి కావాలని మెగా ఫ్యామిలి ని టార్గెట్ చేస్తున్న వర్మ పై ఫాన్స్ యుద్ధం ప్రకటించడం వైరల్ గా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments