శ్రీరెడ్డి కి మెగా హీరో చురకలు !

Tuesday, April 17th, 2018, 02:35:33 PM IST

ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ విషయంలో నటి శ్రీరెడ్డి పెద్ద సంచలనానికి తెర తీసింది. అయితే ప్రస్తుతం ఆమెతో పాటు కొందరు కారెక్టర్ ఆర్టిస్టులు కూడా తాము కూడా అవకాశాల కోసం వెళ్ళినపుడు ఇటువంటి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని అంటున్నారు. కాగా ఈ విషయమై నిన్న మహిళా మండలి ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో శ్రీరెడ్డి సహా కొందరు మహిళా అధ్యక్షులు, కారెక్టర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఈ విషయమై శ్రీరెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని, అన్న మీరు ఒక ఆడపిల్ల బయటకి వచ్చి అర్ధ నగ్న ప్రదర్శన చేసిందంటే ఆమె మనసులో ఎంత ఆవేదన ఉందొ అందరికి అర్ధమవుతుంది, మీకు ఎంతో గొప్ప పేరు వుంది, ప్రస్తుతం మీరు ఒక పార్టీ కి అధినేత కూడా, అందువల్ల మీరు మా లాంటి వాళ్ళ బాధలు తెలుసుకుని మాట్లాడమని అడిగింది.

అయితే తరువాత కొందరు మీడియా వారు పవన్ ను ఈ విషయమై ప్రశ్నించగా. శ్రీరెడ్డి వాదన కు తన మద్దతు తప్పక ఇచ్చేవాడినని, కానీ తాను మద్దతు ఇవ్వడం వల్లనో, లేక టివి డిబేట్ లలో పాల్గొనడం వల్లనో ఈ సమస్యకు పరిష్కారం కుదరదని అన్నారు. కేవలం పోలీస్ లకు కంప్లైంట్ చేయడం, కోర్టులను ఆశ్రయించడంవల్ల తగు న్యాయం జరుగుతుందని అన్నారు. అయితే దీనికి నిన్న అనూహ్యంగా స్పందించిన శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ను అన్న అని ఇకపై సంబోధించనని, అందుకు తన చెప్పుతో తాను కొట్టుకుంటున్నానని అన్నారు. అంతే కాదు మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కు ఏమితెలుస్తుంది ఆడవాళ్ళ సమస్యలు అని ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసింది. నిన్నటినుండి పలువురు నెటిజన్లు, పవన్ అభిమానులు ఆమె తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే నేడు నాగేంద్ర బాబు తనయుడు వరుణ్ తేజ్ తన బాబాయికి మద్దతిస్తూ తన పేస్ బుక్ లో ఒక పోస్ట్ చేసాడు.’ నీ గురించి విమర్శించి, నిన్ను తక్కువ చేసి చూపించాలని ప్రయత్నించే నీచ మనస్కుల గురించి నువ్వు పట్టించుకోనవసరం లేదు. వాళ్ళ తప్పుల్ని వాళ్ళు తెలుసుకోవడం కన్నా ఎదుటి వారిని తప్పుడు వ్యక్తులుగా చూపించడంలోనే ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తారు’ అంటూ ఆయన పోస్ట్ చేసారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ చేసిన ఈ పోస్ట్ కు పవన్ ఫాన్స్ నుండి మద్దతు లభిస్తోంది…..