డిజాస్టర్స్ లో కూడా మంచి ఆఫర్స్ కొట్టేస్తోన్న మెగా హీరో!

Tuesday, May 29th, 2018, 06:58:22 PM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస అపజయాలతో సతమతమవుతోన్న హీరోల్లో సాయి ధరమ్ తేజ్ టాప్ లో ఉన్నాడని చెప్పాలి. అప్పుడెప్పుడో సుప్రీమ్ సినిమాతో హిట్ అందుకున్న సాయి ఇంత వరకు హిట్ అందుకోలేదు. అలాగే ఎన్ని అపజయాలు వస్తున్నప్పటికి అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇక నెక్స్ట్ ఛలో దర్శకుడితో సాయి ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఛలో సినిమాతో నాగ శౌర్య కెరీర్ కు బూస్ట్ ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుములకు స్టార్ ప్రొడ్యూసర్స్ నుంచి ఆఫర్స్ వచ్చాయి. అయితే వెంకీ మాత్రం గీత ఆర్ట్స్ బ్యానర్ లో సినిమాను ఒకే చేశాడు. ఆ ప్రాజెక్ట్ లో సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సాయి కరుణాకరన్ దర్శకత్వంలో తేజ్ ఐ లవ్ యూ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ చేసి ఆ తరువాత స్టార్ట్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి కూడా మెగా మేనల్లుడు తెలుపనున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments