మెగా హీరో సెంటిమెంటును ఫాలో అవుతున్న అఖిల్ ?

Saturday, May 12th, 2018, 11:15:32 AM IST

అక్కినేని అఖిల్ కు ఇప్పుడు ఖచ్చితంగా ఓ హిట్ కావాలి. ఇప్పటికే అఖిల్ విషయంలో అక్కినేని అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. హీరోగా పరిచయం అవుతూ చేసిన అఖిల్ భారీ పరాజయం పాలవడంతో అఖిల్ మీద పెట్టుకున్న ఆశలన్న్ని అడియాశలయ్యాయి. దాంతో కాస్త గ్యాప్ ఇచ్చి చేసిన హలో సినిమా కూడా యావరేజ్ గా మిగిలింది. అందుకే ఈ సారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. అందుకే తన ఏజ్ గ్రూప్ కి సరిపడేలా ఓ క్యూట్ లవ్ స్టోరీతో ముందుకు రావాలని అనుకున్నాడు. అందులో భాగంగా వరుణ్ తేజ్ తో తొలిప్రేమ తీసి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న వెంకి అట్లూరి తో సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే కథా చర్చలు పూర్తయిన ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది. మెగా హీరో వరుణ్ కి కూడా ప్లాప్ తరువాత మంచి హిట్ అందించాడు కాబట్టి తనకు వెంకీ మంచి హిట్ ఇస్తాడన్న కాన్ఫిడెంట్ తో ఉన్నాడు అఖిల్. పైగా తొలిప్రేమ సినిమా షూటింగ్ చేసిన ఇంగ్లాండ్ లోనే ఈ సినిమా షూటింగ్ కూడా జరుపుతారట. అందుకోసమే అద్భుతమైన స్క్రిప్ట్ కుదిరిందట, ఈ విషయంలో నాగ్ కూడా కల్పించుకొనని చెప్పడంతో ఇద్దరు ముందడుగు వేస్తున్నారు. మొత్తానికి మెగా హీరో సినిమాను ఫాలో అవుతున్న అఖిల్ కు ఈ సారైనా మంచి విజయం అందుతుందేమో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments