మీకు మేమున్నాం..పవన్ కు మెగా హీరోల మద్దతు!

Tuesday, January 23rd, 2018, 11:47:00 AM IST

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సోమవారం తెలంగాణలోని కరీనంగర్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రజా యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ మెగా కుటుంబం నుంచి ఎవరైనా సపోర్ట్ చేయడానికి సిద్దపడుతున్నారా అన్న ప్రశ్నకు పవన్ ఎవరు ఊహించని విధంగా జవాబును ఇచ్చారు. తన కుటుంబం నుంచి ఎవరి సపోర్ట్ కోరడం లేదని.. కోరనని కూడా పవన్ గట్టిగా చెప్పాడు. అయితే మెగా యువ హీరోలు మాత్రం పవన్ కు మద్దతు పలికారు.

మీ వెంట మేమున్నాం అంటూ.. విజయం సాధించాలని కోరుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబందించిన న్యూస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ముందుకు రామ్ చరణ్ తన మద్దతును తెలియజేశాడు. ‘నేను భారతీయుడిని. నా మాతృభూమి జాగ్రత్తగా చూసుకుంటాను.’ చలోరే చలోరే చల్‌ కార్యక్రమం ఉత్సాహంగా మొదలైంది. బాబాయ్‌..ఆల్‌ ది బెస్ట్‌. జై జనసేన’ అని పేర్కొన్నాడు. ఇక మరో మెగా బ్రదర్ వరుణ్ తేజ్ ‘ఆల్‌ ది బెస్ట్‌ బాబాయ్‌. మీకు మరింత శక్తి రావాలని అనుకుంటున్నట్లు ట్వీట్ చేశాడు. అలాగే పవన్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మీ వెంట మేము అని ట్విట్టర్ ద్వారా స్పందించడంతో పవన్ అభిమానులు కూడా చాలా పాజిటివ్ గా కామెంట్స్ చేశారు.