ఇద్దరు మెగా హీరోలు ఆయన చేతిలోనే!

Friday, May 4th, 2018, 10:42:26 AM IST

ఊహలు గుస గుసలాడే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్ అవసరాల మరో సినిమాతో పరవాలేదు అనిపింఛాడు. ఇక దర్శకుడిగా కొందరి ప్రముఖులను ఆకర్షించడంలో శ్రీనివాస్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అయితే నెక్స్ట్ ఇద్దరి మెగా హీరోలను మనోడి చేతిలో పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ ని శ్రీనివాస్ అవసరాల ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ఒప్పుకున్నాడు.

అలాగే మరో హీరో కూడా మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఫైనల్ గా శ్రీనివాస్ నుంచి మరో మంచి కాన్సెప్ట్ విన్న నిర్మాత సాయి కొర్రపాటి వైష్ణవ్ తేజ్ కు కరెక్ట్ సెట్ అవుతుందని ప్రాజెక్టును ఫిక్స్ చేసుకున్నారట. దాదాపు మెగాస్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఆ విధంగా ఇద్దరు మెగా హీరోలను శ్రీనివాస్ అవసరాల ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments