కొత్త లుక్ తో అదరగోడుతున్న రామ్ చరణ్..!

Wednesday, September 5th, 2018, 07:26:21 PM IST

“మెగా పవర్ స్టార్ రామ్ చరణ్” హీరోగా మాస్ దర్శకుడు “బోయపాటి శ్రీను” దర్శకత్వం లో ఒక సినిమా తీస్తున్నారని తెలిసిన విషయమే. ఈ సినిమాకి సంబందించి రోజుకొక కొత్త విషయం కానీ షూటింగ్ స్టిల్స్ కానీ బయటకి వస్తున్నాయి. అదే నేపధ్యం లో రామ్ చరణ్ భార్య అయినటువంటి ఉపాసన గారు కూడా ఎప్పటికప్పుడు ఆ సినిమాకి సంబంధించి వార్తను తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. ఈ రోజు కూడా అదే విధంగా తన ట్విట్టర్ ఖాతా నుంచి ఆ సినిమాకి సంబందించిన ఒక ఫోటోను షేర్ చేస్తూ “తర్వాతి షెడ్యూలుకి అంతా సిద్ధంగా ఉంది ఈ సారి రఫ్ గా ఉండే రామ్ చరణ్ ని చూడబోతున్నారు” అని ట్వీట్ చేశారు.

మాస్ ప్రేక్షకుల నాడి తెలిసిన బోయపాటి శ్రీను ఈ సినిమాలో రామ్ చరణ్ ని ఏ విధంగా చూపించబోతున్నారో అని రామ్ చరణ్ అభిమానుల తో పాటు మాస్ ప్రేక్షకులలో ఉత్కంఠ నెలకొంది. ఈ చిత్రం లో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు, ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ బాణీలను అందిస్తున్నారు. డి.వి.వి దానయ్య గారు ఈ చిట్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. టైటిల్ ఇంకా ఖరారు కానీ ఈ చిత్రాన్ని 2019 సంక్రాంతి కానుకగా తీసుకురానున్నారు. “రంగస్థలం”తో నాన్ బాహుబలి రికార్డు సృష్టించిన రామ్ చరణ్ ఈ చిత్రం తో ఎన్ని ప్రకంపనలు సృష్టిస్తాడో వేచి చూడాలి..

  •  
  •  
  •  
  •  

Comments