కేరళలో సైరా రెండో షెడ్యూల్ ?

Thursday, January 18th, 2018, 09:56:37 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం సైరా. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ కేరళలో మొదలు కానుందట. ఫిబ్రవరి రెండో వారంలో ప్రారంభం కానుందని, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఈ షెడ్యూల్ లోనే హీరోయిన్ నయనతార పాల్గొననుంది. మెగాస్టారా కెరీర్ లోనే అత్యంత భారీ చిత్రంగా, స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కథతో తెరకెక్కే ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. వచ్చే దసరా సందర్బంగా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు టాక్ !!