మెగాప్రిన్స్‌ ప్ర‌యోగం నం.6

Sunday, June 10th, 2018, 11:43:46 AM IST

మెగాబ్ర‌ద‌ర్ నాగబాబు వార‌సుడు వ‌రుణ్‌తేజ్ గ‌ట్స్ గురించి ప్ర‌త్యేకంగా అభిమానుల్లో చ‌ర్చ‌కొచ్చింది. అత‌డు కెరీర్ ఆరంభం నుంచి చేస్తున్న ప్ర‌యోగాలు ఒకెత్తు అయితే, ప్ర‌స్తుతం అత‌డు న‌టిస్తున్న స్పేస్ బ్యాక్‌డ్రాప్ మూవీ పూర్తిగా మ‌రొక ఎత్తు. సంక‌ల్ప్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఘాజీని మించిన ప్ర‌యోగం చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ ఏర్పాట్ల‌లో బిజీబిజీగా ఉన్నారంతా.

ఇక‌పోతే ఇదే టైమ్‌లో మ‌రో షాకింగ్ న్యూస్ లీక్ చేశాడు వ‌రుణ్‌తేజ్‌. ఈసారి ఏకంగా క‌మ్యూనిస్ట్ భావ‌జాలం మెండుగా ఉన్న సాగ‌ర్ చంద్ర దర్శ‌క‌త్వంలో అతడు నటిస్తాడ‌ట‌. ప్ర‌జానాట్య‌మండ‌లి క‌ళాకారుల బృందానికి చెందిన.. క‌మ్యూనిస్ట్ భావ‌జాలం నిండిన ఓ జ‌ర్న‌లిస్టు త‌న‌యుడు సాగ‌ర్ చంద్ర‌. అందుకే అత‌డు తెర‌కెక్కించిన `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` విప్ల‌వ‌ధోర‌ణితో ర‌క్తి క‌ట్టించింది. ఆ సినిమా క్రిటిక‌ల్‌గా ప్ర‌యోగాత్మ‌క చిత్రం. ఇప్పుడు వ‌రుణ్‌కి ఎలాంటి క‌థ చెప్పాడో? అన్న ఆస‌క్తి నెల‌కొంది. డిసెంబ‌ర్‌లో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ తెర‌కెక్కించ‌నుంది. క‌మ్యూనిజం భావ‌జాలం ఉన్న ద‌ర్శ‌కుడు సాగ‌ర్ చంద్ర‌.. వ‌రుణ్‌ని ఎలా చూపిస్తాడో అంటూ మెగా ప్రిన్స్ అభిమానులు ఒక‌టే ఉత్కంఠ‌గా ఉన్నారు. వ‌రుణ్‌తేజ్ న‌టించే 6వ సినిమా కూడా ప్ర‌యోగ‌మేనా? అంటూ మాట్లాడుకుంటున్నారంతా. ముకుంద‌, కంచె, లోఫ‌ర్‌, ఫిదా, సంక‌ల్ప్ సినిమా.. ఇప్పుడు సాగ‌ర్‌తో సినిమా.. అన్నీ ప్ర‌యోగాలే సుమీ!!