సెకండ్ హాఫ్ చూస్తూ ఏడ్చేసాను – చిరంజీవి

Friday, February 10th, 2017, 11:39:26 AM IST


అక్కినేని నాగార్జున నటించిన ఓం నమో వెంకటేసాయ చిత్రం ఇవాలే ప్రేక్షకుల ముందరకి వచ్చేసింది. ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ని నాగార్జున తో కలిసి చూసిన మెగాస్టార్ చిరంజీవి మీడియా తో మాట్లాడుతూ తన స్పందన తెలియజేసారు. ఈ సినిమా చూడడం ఒక అద్బుతమైన అనుభవం అని పొగిడిన చిరు సినిమా మొత్తం భక్తి భావంతో సాగింది అన్నారు. సెకండ్ హాఫ్ చాలా హృద్యంగా తీసారు అనీ తన కళ్ళు చెమర్చాయి అనీ అన్నారు చిరు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి కిందకు రావడం.. భక్తుడి కేరక్టర్ తో వెంకన్న కళ్యాణం జరిపించడం దగ్గర నుంచి చివరి వరకూ సినిమా అత్యద్భుతంగా ఉంది. ఈ సినిమా ఒక ఎమోషనల్ ట్రావెల్ లా ఉంది’ అన్నారు మెగాస్టార్.