చిన్నల్లుడిని విజేతగా మార్చేందుకు మెగా సైన్యం దిగుతోంది ?

Sunday, June 10th, 2018, 11:36:59 AM IST

మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హీరో ఎవరో కాదు మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్. కళ్యాణ్ దేవ్ హీరోగా రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న విజేత సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. మాళవిక నాయర్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాను వారాహి చలనచిత్ర బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో ఈ నెల 24న జరపనున్నారు ఈ వేడుకకు మెగా సైన్యం ముఖ్య అతిధులుగా రానున్నారు. తన చిన్నల్లుడికి మంచి విజయం అందించేలా ఆ సినిమాకు క్రేజ్ తెచ్చుకుంది మామ మెగాస్టార్, రామ్ చరణ్ , సాయి ధరమ్ తేజ్ లు రానున్నారు . వారితో పాటు పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే అల్లు అర్జున్ కూడా పాల్గొనే ఛాన్స్ ఉందట. సో ఈ దెబ్బతో కళ్యాణ్ కు మెగా ఫ్యాన్స్ అండదండలు కూడా భారీగా ఉంటాయి మరి.