చిరు – కొరటాల సినిమా సంక్రాంతికి ప్రారంభం ?

Sunday, September 16th, 2018, 11:04:52 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో అయన 152 వ చిత్రానికి సన్నాహాలు ఊపందుకున్నాయి. మెగాస్టార్ తదుపరి చిత్రం ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తో చేస్తానన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొరటాల శివ మెగాస్టార్ కోసం ఓ సూపర్ స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నాడట. స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతికి ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాకు నిర్మాత ఎవరన్నా విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఈ సినిమాను కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తాడంటూ వార్తలు వస్తున్నాయి .. అయితే మరో వైపు మైత్రి మూవీస్ కూడా కొరటాల కాంబినేషన్ లో ఓ సినిమాకు ప్లాన్ చేసారు .. కాబట్టి ఈ సినిమా మైత్రి బ్యానర్ లో ఉంటుందంటూ వార్తలు వస్తున్నాయి. సో దానిపై త్వరలోనే క్లారిటీ రావాల్సి ఉంది. వరుస విజయాలతో టాలీవుడ్ లో క్రేజీ దర్శకుడిగా మారిన కొరటాల శివ , మెగాస్టార్ ల కాంబినేషన్ లో వచ్చే సినిమా మంచి సోషల్ మెసెజ్ తో ఉంటుందని టాక్ ?

  •  
  •  
  •  
  •  

Comments