ఆ వేడుకలకు చీఫ్ గెస్ట్ లుగా మెగా స్టార్, సూపర్ స్టార్ ?

Tuesday, February 13th, 2018, 12:05:47 PM IST

`మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్) 25 వ‌సంతాలు పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఇటీవ‌లే హైద‌రాబాద్ లో టాలీవుడ్ ప్రముఖుల స‌మ‌క్షంలో అంగ‌రంగ‌వైభంగా కర్టన్ రైజ‌ర్ కార్యక్రమం జ‌రిగింది. కాగా ఏప్రిల్ 28న అమెరికా లోని డ‌ల్లాస్ లో తొలి ఈవెంట్ గ్రాండ్ గా జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హ‌జ‌ర‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. తదుపరి మే లో జరగబోయే రెండో ఈవెంట్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిధిగా హాజరవుతారట.

మా అధ్యక్షులు శివాజీరాజా మాట్లాడుతూ, చిరంజీవి గారికి `మా` వేడుక‌లు గురించి చెప్ప‌గానే వెంట‌నే ఒప్పు కున్నారు. ఎక్క‌డికి రావడానికైనా సిద్దంగా ఉన్నాన‌ని హామీ ఇచ్చారని, అలాగే మ‌హేష్ బాబు గారు కూడా మేలో జ‌రిగే ఈవెంట్ కు తప్పక వ‌స్తాన‌న్నారని తెలిపారు. వస్తానని మాటఇచ్చిన ఇరువురికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మెగా స్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సపోర్ట్ ని మర్చిపోలేము. అందుకే ‘మా’ నిర్మించే నూతన భవంతి లొ రెండు వింగ్స్ కి చిరంజీవి గారి పేరుని, మహేష్ గారి పేరుని పెట్టి వారికి గౌరవం ఇవ్వదలిచం. అలాగే బాల‌కృష్ణ‌, మోహ‌న్ బాబు, వెంక‌టేష్, నాగార్జున కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. `మా` కోసం ఎత‌క‌ష్ట‌మైనా ప‌డ‌టానికి నేను, మా సభ్యులం అందరం సిద్దంగా ఉన్నాం అన్నారు.

ఈ సిల్వ‌ర్ జూబ్లీ వేడుకల సంద‌ర్భంగా 35 మంది ఆర్ధిక స్తోమత లేని నటులకు ఈ నెల నుంచి 3000 పెన్ష‌న్ అందేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నాం అన్నారు. జనరల్ సెక్రెటరీ నరేష్ మాట్లాడుతూ హీరోయిన్లు అంద‌రూ కూడా మెంబ‌ర్ షిప్ తీసుకోవాలి. `మా` జ‌రిపే కార్య‌క్ర‌మాల‌కు కూడా స‌హ‌కారం అందించాలి అని అన్నారు. క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో నభూతో న‌భ‌విష్య‌తి అన్నట్లు ఈ వెంట్ ను గ్రాండ్ గా చేయనున్నామని, అమెరికాలో ఉన్న ఎన్ ఆర్ ఐ లంతా ఈవెంట్ కు హ‌జ‌ర‌వుతారన్నారు. దాదాపు 8000 నుండి10,000 సామార్ధ్యం గ‌ల ఆడిటోరియంలో ఈవెంట్ జ‌ర‌గ‌నుందని, ఒకే వేదిక‌పై టాలీవుడ్ తారలందరూ లైవ్ లో అభిమానులని అలరించనున్నారని, ఈ వేడుకకు సహకరిస్తున్న ప్రముఖులందరికి తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు…..