‘మెగా’ సమ్మోహనం…

Monday, April 30th, 2018, 04:06:59 PM IST

చిన్న సినిమా, పెద్ద సినిమా అంటూ తేడా లేకుండా అందరికి నేనున్నానంటూ … గత కొద్దికాలంగా ఎవరు పిలిచినా వచ్చి తన సపోర్టును ఇస్తున్నారు అభిమాన నటుడు మెగాస్టార్‌ చిరంజీవి. అయితే ఈ మధ్య చాలా సినిమా ఫంక్షన్లకు హాజరైన చిరు తాజాగా సుధీర్‌ బాబు నటిస్తున్న‘సమ్మోహనం’సినిమా టీజర్‌ను చిరంజీవి రేపు (మే 1) విడుదల చేయదానికి సిద్దమయ్యారు.

ఇలా చిత్ర సిమలో చిన్న సినిమాలు హిట్టు కొట్టడానికి చేస్తున్న ప్రమోషన్లలో తన వంతు సహాయాన్ని చిరు చేస్తున్నారు. ఆయన కూడా ఇలాంటి వాటికి రావడానికి కాస్త ఎక్కువగానే శ్రద్ధ చూపిస్తున్నట్లు సినీవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు తను హీరోగా ఎదుగుతున్న సమయంలో ఒక పెద్ద హీరోను తన సినిమా ఫంక్షన్‌కు పిలిస్తే రాలేదని…అప్పుడు చాలా బాధపడ్డానని… ఆ బాధేంటో తనకు తెలుసునని, ఒక పెద్ద హీరో ఇలా వచ్చి ప్రమోట్‌ చేస్తే ఆ సినిమాకు బూస్ట్‌ను ఇచ్చినట్టు అవుతుందని ఇటీవలే హాజరైన ఓ ఆడియో ఫంక్షన్‌లో చిరంజీవి తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని మరీ చెప్పారు.

ఇక రేపు సమ్మోహనం సినిమా టీజర్‌ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్‌ కానుంది. గత కొద్దిరోజులుగా సరైన హిట్ లేక గందరగోళంలో చిక్కుకున్న సుధీర్‌ బాబు ఈ సినిమాతో ఎలాగైన విజయం సాధించాలనుకుంటున్నాడు. ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించగా..శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణ సారథ్యంలో ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం కూర్చాడు. ఈ సినిమాలో సుధీర్‌బాబుకు జంటగా అదితి రావు నటిస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments