మెగాస్టార్ కన్నీరు పెట్టలేదు.. అంతా మోసం!

Monday, April 30th, 2018, 12:57:19 PM IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆయన భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నట్లు ఉన్న ఆ వీడియో హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా మెగాస్టార్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సిల్వర్ జూబ్లీ వేడుక సందర్బంగా డల్లాస్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అక్కడే మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నట్లు సోషల్ మీడియాల్లో అలాగే ఇతర న్యూస్ చానళ్లలో చర్చనీయాంశంగా మారింది. అయితే మెగా ప్రవాసులు ఈ వార్తలలను కొట్టి పారేశారు. ఆ వీడియో 2013 నాటిదని కావాలనే కొందరు కులాలను రెచ్చగొట్టే విధంగా కామెంట్స్ జోడించి వీడియోను పోస్ట్ చేశారని ఎన్నారైలు తెలిపారు. ఇక వీడియో 2013దని ఈజీగా అర్ధమవుతోంది. ఎందుకంటే మెగాస్టార్ ప్రస్తుతం గెడ్డం లుక్ లో ఉన్నారు. 2013 లో ఆయనకు గెడ్డం లేదు. అందువల్ల ఈ వీడియో ఎప్పటిదో అభిమానులే గ్రహించాలని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments