పవన్ కళ్యాణ్ ను వెండితెర మీద చూడటానికి మీలాగే నేను కూడా ఎదురుచూస్తున్నాను

Thursday, April 8th, 2021, 04:14:12 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ ఏప్రిల్ 9 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ వెండితెర పై కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక కూడా జరిగింది. అయితే తాజాగా ఈ చిత్రం పై, పవన్ కళ్యాణ్ ను వెండితెర పై మళ్ళీ చూడటం పట్ల మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ అన్నయ్య స్పందించారు.

చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ ను వెండి తెర మీద చూడటానికి మీలాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. అమ్మ, కుటుంబ సభ్యులతో రేపు సాయంత్రం థియేటర్ లో వకీల్ సాబ్ చూస్తున్నాను అని చిరు పేర్కొన్నారు. అయితే ఈ చిత్రం ఎలా ఉండనుంది అనేది షేర్ చేసుకోవడానికి ఎంతో ఆతృతగా ఉన్నట్లు తెలిపారు. స్టే ట్యూన్డ్ అంటూ చెప్పుకొచ్చారు. చిరు చేసిన ట్వీట్ పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఉన్న ఒక ఫోటో ను షేర్ చేశారు చిరు. ఈ ఫోటో సూపర్ అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. వకీల్ సాబ్ చిత్రం ఏప్రిల్ 9 వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందించగా, వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. నివేదా థామస్, అంజలి, అనన్య లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.